ఆసియా క్రీడల ఫైనల్లో శ్రీలంక ముందు భారీ లక్ష్యం నిలిపిన భారత మహిళల జట్టు

రిపోర్టర్: కిరణ్ స్థలం: జపాన్

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన (79) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, షఫాలీ వర్మ (48), ఆఖర్లో రిచా ఘోష్ (49 నాటౌట్) చెలరేగి ఆడటంతో శ్రీలంక ముందు 217 పరుగుల భారీ లక్షం నిలిచింది.