జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన తాండవ కృష్ణకు సన్మానం
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన బద్రి తాండవ కృష్ణ జాతీయ స్థాయి అండర్ -16 సాఫ్టబాల్ గేమ్స్ కు ఎంపిక కావడం గర్వకారమని పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని ఘనంగా సన్మానించి అభినందించారు. క్రీడల్లో రాణించడానికి ప్రతిభతో పాటు పట్టుదల, క్రమశిక్షణ ఎంతో అవసరమని, జాతీయ స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.