లైవ్స్ట్రీమింగ్లో క్యూఆర్ కోడ్ లీక్: పది లక్షల బిల్లు చెల్లించిన అమెరికన్ స్ట్రీమర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Tokyo

జపాన్లో లైవ్స్ట్రీమింగ్ చేస్తుండగా అమెరికన్ స్ట్రీమర్ లేసీకి ఊహించని షాక్ తగిలింది. టేబుల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను గమనించిన ఆన్లైన్ వీక్షకులు భారీగా ఫుడ్ ఆర్డర్లు చేయడంతో ఏకంగా పన్నెండు వేల డాలర్ల బిల్లు వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సరదాకోసం వ్యూవర్స్ చేసిన ఈ పని వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, ఇది తనకు చేదు అనుభవంగా మిగిలిందని లేసీ వాపోయారు.