హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఫ్లాట్లకు సరిపడా స్థానిక అర్హులైన పేదలు లభించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. క్షేత్రస్థాయి విచారణలో ఇతర ప్రాంతాల వారు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తేలడంతో, పొరపాట్లను సరిదిద్దుకునేందుకు గృహ నిర్మాణ మండలి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తును బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించారు.