పేదల సంక్షేమమే ధ్యేయంగా అందిన సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన కొంతం హరితకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ దేవేందర్ మంగళవారం అందజేశారు. సర్పంచ్ జువ్వి నరసింహ సమక్షంలో చెక్కును అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.