భారత మహిళా జట్టు ఫీల్డింగ్ వైఫల్యం: మైకెల్ వాన్ సెటైరికల్ కామెంట్స్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

భారత మహిళా క్రికెట్ జట్టు క్యాచ్ లు జారవిడుచుకోవడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఎద్దేవా చేశారు. జాతీయ మహిళా జట్టు ఫీల్డింగ్ కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఈ మేరకు తాను ఫీల్డింగ్ కోచ్ గా పనిచేస్తానంటూ మైకెల్ వాన్ ఎక్స్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారని క్రీడా వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో మన అమ్మాయిలు కీలకమైన క్యాచ్ లు నేలపాలు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.