ఆర్టీసీ ఎన్నికల్లో అశ్వత్థామ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి: కాంగ్రెస్ నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జహీరాబాద్
జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అభ్యర్థి అశ్వత్థామ రెడ్డి విజయం కోరుతూ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్న అశ్వత్థామ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.