ఆసియా క్రీడలకు అందుబాటులోకి టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రి

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రి ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించడంతో 2026 ఆసియా క్రీడల్లో డబుల్స్ పోటీలకు సిద్ధమయ్యాడు. యుఎస్ ఓపెన్ సమయంలో గాయపడిన ఆయన డేవిస్ కప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి సుందర్ అయ్యర్ ఈ విషయాన్ని ధృవీకరించగా, జపాన్‌లోని నాగోయా వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత జట్టు బరిలోకి దిగనుంది.