బలిజిపేటలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం నిర్వహించిన గ్రామ యువకులు

రిపోర్టర్: GANESH BBL స్థలం: బలిజిపేట

పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం బైరిపురం గ్రామంలో గణేష్ ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా ముగిశాయి. గ్రామ యువకులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ సెంటర్ ఇంచార్జ్ రాజేశ్వరి అక్కయ్య గ్రామస్తులకు వ్యసన ముక్తిపై ప్రతిజ్ఞ చేయించారు. ఆధ్యాత్మిక జ్ఞానం, రాజయోగ మెడిటేషన్ ద్వారా ప్రజల్లో సానుకూల మార్పులు వస్తున్నాయని గ్రామ పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని రాజేశ్వరి పిలుపునిచ్చారు.