అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కీలక ప్రతిపాదన తెచ్చిన ఇరాన్

రిపోర్టర్: సురేష్ స్థలం: టెహ్రాన్

అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరాన్ ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి, కేవలం ఏడు రోజుల్లోనే విస్తృత చర్చలను పునఃప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. మధ్యవర్తుల ద్వారా ఈ వారంలోనే ఈ ప్రతిపాదనను అమెరికా అధికారులకు పంపినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనపై అమెరికా వైపు నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.