బెల్లంపల్లి ప్రభుత్వ వసతి గృహం ఎదుట అక్రమ దుకాణాలు తొలగించాలి

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని షెడ్యూల్ బాలుర కళాశాల వసతి గృహం ఎదుట అక్రమంగా నిర్వహిస్తున్న పండ్ల దుకాణాలను తక్షణమే తొలగించాలని పట్టణ ఫ్రూట్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌస్ డిమాండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఈ దుకాణాలపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.