ముప్పై ఏళ్ల క్రితం లంచం కేసులో దోషిగా తేలిన మాజీ ఉద్యోగికి హైకోర్టులో చుక్కెదురు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: జార్ఖండ్

జార్ఖండ్‌లోని రాంచీ హటియా రైల్వే స్టేషన్‌లో 1995లో రూ.100 లంచం తీసుకున్న కేసులో మాజీ పార్శిల్ క్లర్క్ కాళీ శంకర్ ధోబి దోషిగా తేలారు. ఈ మేరకు ఆయనకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను జార్ఖండ్ హైకోర్టు సమర్థించింది. అయితే ఆయన వయస్సు, అనారోగ్యం, కేసు విచారణలో జరిగిన సుదీర్ఘ జాప్యాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కారాగార శిక్షను కొంతమేర తగ్గించింది.