ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అకడమిక్ ఎక్స్‌లెన్స్‌పై దృష్టిసారించాలని మంత్రి లోకేశ్ సూచన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అకడమిక్ ఎక్స్‌లెన్స్‌పై దృష్టిసారించాలని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ సూచించారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్ అధ్యక్షతన ఏపీఆర్‌ఈఐఎస్‌ గవర్నింగ్‌ బాడీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గంలోని భూపతిపాలెం పాఠశాలను విద్య, క్రీడా హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, కృష్ణా జిల్లా నిమ్మకూరులో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.