విద్యార్థులకు అలర్ట్: బిట్స్ డిజైన్ స్కూల్ 2027 ప్రవేశాల ప్రకటన
రిపోర్టర్: సతీష్
స్థలం: Mumbai
ముంబైలోని ప్రతిష్టాత్మక బిట్స్ డిజైన్ స్కూల్ 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు సంవత్సరాల బాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డీన్ నందిత అబ్రహాం తెలిపారు. ఈ కోర్సులో మొత్తం రెండు వందల పది సీట్లు అందుబాటులో ఉంటాయని, అర్హత గల ఆసక్తికర అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటి లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.