సైబర్ నేరగాళ్లకు సుప్రీంకోర్టు షాక్: కేసుల విలీన పిటిషన్ కొట్టివేత

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల సౌలభ్యం కోసం వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన కేసులను ఒకేచోటికి విలీనం చేయలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. బాధితుల హక్కులను కాలరాయలేమని స్పష్టం చేస్తూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు.