రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం

రిపోర్టర్: గోపి స్థలం: Amaravati

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన 21వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.