నర్సీపట్నంలో పార్టీ కార్యకర్తలకు ఐదు లక్షల ఉచిత ప్రమాద బీమా

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నం నియోజకవర్గంలో పదివేలకు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు ఐదు లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని, పార్టీ సభ్యత్వాలు పూర్తి చేసి ఇప్పటికే ఐడి కార్డులు అందించామని ఆయన వెల్లడించారు.