మార్కాపురంలో ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ ఘనంగా 5కె మారథాన్

రిపోర్టర్: రాజేష్ స్థలం: మార్కాపురం

మార్కాపురంలో ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ 5కె మారథాన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయసునీత కోర్టు సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి హెచ్ ఐ వి పై అపోహలు తొలగించి నివారణ చర్యలపై చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ మారథాన్ లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.