తీవ్రవాయుగుండం ముప్పు నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
రాష్ట్రానికి తీవ్రవాయుగుండం ముప్పు పొంచివున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. రిజర్వాయర్లలో నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.