మంథనిలో ఘనంగా పల్లి సంజీవరావు జన్మదిన వేడుకలు
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
మంథని ప్రాంతానికి చెందిన మార్కెటింగ్ అధికారి పల్లి సంజీవరావు జన్మదిన వేడుకలు శుక్రవారం పెంజేరుకట్ట వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రిటైర్డ్ డిఎస్పీ చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు, చిన్ననాటి స్నేహితులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే సంజీవరావు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.