బ్రాహ్మణుల సంక్షేమ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని సబ్ కలెక్టర్‌కు వినతి
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గోశాల, వేద పాఠశాల, గాయత్రి మాత ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. దీనిపై సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మెర లక్ష్మణ్, రాంభట్ల హరీష్ శర్మ, విఎల్ఎస్ శ్రీనివాస్, జగన్మోహన్ చారి, మనోజ్ పాండే పాల్గొన్నారు.