రాష్ట్ర పండుగగా మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
గురజాడ 164వ జయంతి సందర్భంగా గురజాడ స్వగృహంలో చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి జన్మదిన వేడుకలు ప్రారంభించారు రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెసి సేధు మాధవన్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కుటుంబ సభ్యులు, సాంస్కృతిక శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.