కృష్ణా జలాల పంపకం: తేలని పంచాయితీ, మళ్లీ బోర్డు భేటీ

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. తెలంగాణ 200 టీఎంసీలు, ఏపీ 104 టీఎంసీల నీటిని డిమాండ్ చేశాయి. 66:34 నిష్పత్తిపై ఏపీ పట్టుబట్టగా, ఎల్‌నినో నేపథ్యంలో 50:50 వాటా ఇవ్వాలని తెలంగాణ కోరింది. పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా నీటి తరలింపుపై ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. ఈ నెలాఖరున మరోసారి సమావేశం కానున్నారు.