నవిముంబైలో దారుణం: తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు
రిపోర్టర్: సురేష్
స్థలం: Navi Mumbai
నవిముంబైలోని తుర్బే ప్రాంతంలో తొమ్మిదేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన విషాదాంతమైందని, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ షిండే వెల్లడించారు. శనివారం ఆడుకోవడానికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోగా, మంగళవారం ఉదయం పవనే ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఆమె శవం లభ్యమైంది. సీసీటీవీ టేజ్ ఆధారంగా స్థానికంగా పనిచేస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.