విజయవాడ మేయర్ ఎన్నికల ప్రచారం: పరస్పరం పలకరించుకున్న ప్రత్యర్థులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయవాడ
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మేయర్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న వంగవీటి రాధాకృష్ణ, స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన ఏబీ వెంకటేశ్వరరావు మాచవరం దాసాంజనేయస్వామి గుడి వద్ద ఎదురుపడ్డారు. పాదయాత్రగా వెళ్తున్న వెంకటేశ్వరరావు ప్రచార రథంపై ఉన్న రాధాకృష్ణను చూసి చేయి ఊపారు. వెంటనే ఆయన రథం నుంచి దిగివచ్చి ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నవారు ఆప్యాయంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించిందని అధికారులు తెలిపారు.