గోదావరి పుష్కరాల అభివృద్ధికి రూ.ఏడు కోట్లతో శంకుస్థాపన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చెన్నూరు

మంచిర్యాల జిల్లా చెన్నూరులో రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భారీ అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ.ఎనిమిది కోట్లతో శంకుస్థాపన చేశారు. దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.