చెన్నూరులో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చెన్నూరు
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రజల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరులో రూ.ఐదు కోట్ల యాభై లక్షలతో రోడ్ల విస్తరణ, రూ.పదిహేడు కోట్లతో పెద్ద చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అమృత్ పథకం కింద రూ. ముప్పై కోట్ల పనులు చేపట్టామన్నారు. అంతేకాకుండా వచ్చే అక్టోబర్ మొదటి వారంలో నూతన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.