పురుషోత్తపురంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ మొదలైంది
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో జరుగనున్న ఎంపీటీసీ మరియు జడ్పీటీసి ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లతో పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఓటర్లు అందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తోంది.