జీవీఎంసీలో 120 వార్డుల పునర్విభజన.. ముసాయిదా విడుదల
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా మారుస్తూ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రతిపాదిత వార్డుల సరిహద్దుల వివరాలు సెప్టెంబర్ 5 నుండి జీవీఎంసీ వెబ్సైట్, జోనల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 11లోపు కమిషనర్‌కు సమర్పించాలని అధికారులు సూచించారు.