ది ప్యారడైజ్ చిత్రానికి ఆ పేరు సరిపోకపోతే సమ్మక్క టైటిల్ పెడతామన్న నాని
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్రయూనిట్ వరుస ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ ప్రమోషన్లలో భాగంగా హీరో నాని మాట్లాడుతూ.. ఒకవేళ తమ సినిమాకు ది ప్యారడైజ్ కాకుండా వేరే ప్రత్యామ్నాయ శీర్షిక పెట్టాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా సమ్మక్క అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని పేర్కొనడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.