షాకింగ్ ఘటన: ఫంగల్ వ్యాధితో నలుగురు రెయిన్ బో పాముల మృతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Virginia

అమెరికాలో ఫంగల్ వ్యాధి కారణంగా పదేళ్ల కాలంలో నలుగురు రెయిన్ బో పాములు మృతి చెందినట్లు పరిశోధకులు వెల్లడించారు. వర్జీనియా మరియు నార్త్ కరోలినా ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓఫిడియోమైసిస్ ఓఫిడియోమిసిలా అనే ఫంగస్ వల్ల ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ సోకుతుందని, దీనివల్ల పాముల చర్మం దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ అరుదైన సరీసృపాల మనుగడపై ఆందోళన వ్యక్తమవుతోంది.