తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఆర్మీ నిపుణుల సేవలు కోరిన ఉత్తమ్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఢిల్లీ

తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం ఆర్మీ టన్నెలింగ్ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా సేవలను పొడిగించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కోరారు. కాళేశ్వరం, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తికి మరో ముగ్గురు ఆర్మీ నిపుణులను డిప్యూటేషన్‌పై పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై ఆర్మీ చీఫ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.