దిశ కథనంతో కదిలిన ఇరిగేషన్ అధికారులు నాలా అడ్డంకుల తొలగింపునకు ఆదేశం

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నంలో దిశ దినపత్రికలో ప్రచురితమైన నాలాకు దారేది కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. గ్రామ నక్షలో నమోదైన సహజ నీటి ప్రవాహ మార్గాన్ని పరిశీలించిన ఇరిగేషన్ డీఈ అనిల్‌కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్.. గ్రూపే రియల్‌ఎస్టేట్ వెంచర్‌లో నాలాకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడను గుర్తించారు. తక్షణమే అడ్డంకిని తొలగించాలని యాజమాన్యాన్ని హెచ్చరించగా, రెండు రోజుల సమయం కావాలని వారు కోరడంతో గడువులోగా తొలగించాలని అధికారులు స్పష్టం చేశారు.