మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. గాంధీభవన్లో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ ప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నాయకత్వంలో ఆయనకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్న ఆయన నాయకత్వం స్ఫూర్తిదాయకమని తెలంగాణ ప్రదేశ్ మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ రేఖా బోయలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ కొనియాడారు.