జార్జ్ ఫ్లాయిడ్ స్మారక నిధులపై కుటుంబంలో చెలరేగిన తీవ్ర వివాదం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మిన్నెసోటా
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత సేకరించిన భారీ విరాళాల నిధుల నిర్వహణపై ఆయన కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిసే ఫ్లాయిడ్ నుంచి పూర్తి స్థాయి ఆర్థిక లెక్కలు కావాలని ఆయన తోబుట్టువులు జ్సాజ్సా, లాటోన్యా, రాడ్నీ ఫ్లాయిడ్ డిమాండ్ చేశారు. మిన్నెసోటాలో జరిగిన ఈ పరిణామంపై హ్యూస్టన్ అటార్నీ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు టీఎమ్జెడ్ వెల్లడించింది.