అధికారం శాశ్వతం కాదంటూ వైసీపీ నేతలపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని ఫైర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: గురజాల
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలను ఉద్దేశించి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తమను ఇబ్బందులకు గురిచేస్తే పరిస్థితులు ఎలా మారుతాయో ఇప్పుడు అర్థమవుతోందని ఆయన నిలదీశారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.