గుంటూరు జిల్లాలో గోడ నిర్మాణానికి తక్షణ చర్యలంటూ నారా లోకేష్ ఆదేశం

రిపోర్టర్: శివ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లాకు చెందిన స్థానిక సమస్యపై స్పందించిన నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితుడు వెంకప్ప చేసిన విజ్ఞటనను పరిగణలోకి తీసుకున్న ఆయన, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అత్యంత ప్రాధాన్యత ప్రాతిపదికన రక్షణ గోడ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.