శేరిలింగంపల్లి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరిన గాంధీ

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలని పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ కోరారు. సీఎమ్సీ కమిషనర్ సృజనతో నిర్వహించిన సమీక్షలో చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, నాలాల విస్తరణపై చర్చించారు. బాధితులకు టీడీఆర్ ద్వారా తక్షణ న్యాయం చేయాలని అధికారులను ఆయన స్పష్టంగా ఆదేశించారు.