రామాయణం సినిమా విశేషాలు: సీతాదేవి పాత్ర కోసం ప్రార్థనలు చేశానన్న సాయిపల్లవి
రిపోర్టర్: అశోక్
స్థలం: Mumbai
రామాయణం చిత్రంలో సీతాదేవి పాత్ర పోషించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని, ఆ పాత్ర కోసం తాను ప్రత్యేకంగా ప్రార్థనలు, ధ్యానం చేశానని ప్రముఖ నటి సాయిపల్లవి వెల్లడించారు. కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాదని, భావితరాలకు నిలిచే చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. పాత్రకు తగిన హుందాతనం తీసుకురావడానికి నిరంతరం ప్రార్థన చేసినట్లు సాయిపల్లవి తెలిపారు.