మున్సిపల్ ఎన్నికల్ లో జనసేన సంచలనం: వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో జనసేన పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ ఘన విజయం సాధించి వంద శాతం స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. విజయవాడ మరియు ఏలూరు కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలలో జనసేన అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారని, కూటమి పొత్తులో భాగంగా దక్కిన స్థానాలన్నింటినీ పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు.