ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు

రిపోర్టర్: రమేష్ స్థలం: India

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వంటి దిగ్గజ నటులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దేశానికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. దేశ ప్రజలను ప్రేరేపిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.