రణవీర్ సింగ్ కు మద్దతివ్వడంపై స్పష్టతనిచ్చిన నటి ఉపాసన సింగ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Mumbai
సినిమా నటుడు రణవీర్ సింగ్ కు బహిరంగంగా మద్దతు తెలపడం వల్లే తనకు షోకాజ్ నోటీసు జారీ చేశారని సినీ నటి, సింటా జనరల్ సెక్రటరీ ఉపాసన సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తోటి సభ్యులకు అండగా నిలవడం తన బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. సింటా అంతర్గత వివాదాలు, పూనమ్ ధిల్లాన్ వివరణ కోరడం వంటి పరిణామాలపై ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ కీలక విషయాలను వెల్లడించారు.