జాతీయ ఏక్తా దివాస్ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా జెతురం తండా సర్పంచ్ ఎంపిక
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జెతురం తండా సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ గుజరాత్లోని ఏక్తా నగర్లో ఈనెల 31న జరిగే రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి ఎంపిక కావడం పట్ల సర్పంచ్ హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.