ది ప్యారడైజ్ మూవీ స్టోరీలైన్ రివీల్ చేసిన శ్రీకాంత్ ఓదెల

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

నాని హీరోగా వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రెస్‌మీట్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిత్ర కథాంశాన్ని వెల్లడించారు. ఇది తల్లి కొడుకుల భావోద్వేగ కథాంశంతో పాటు, దేశం కోసం పోరాడి విస్మరించబడిన ఒక సవారీ జాతి తిరుగుబాటు నేపథ్యంలో సాగే రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.