దిగ్గజ నటుడు ఏఎన్నార్ జయంతిపై మెగాస్టార్ చిరంజీవి నివాళి

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఘన నివాళులు అర్పించారు. కొన్ని తరాలను నటులు అలరిస్తే, మరికొన్ని తరాలకు స్ఫూర్తినిస్తారని ఆయన కొనియాడారు. మెకానిక్ అల్లుడు చిత్రంలో ఏఎన్నార్ తో కలిసి నటించడం తన సినీ ప్రయాణంలో ఎప్పటికీ మరువలేని అపురూప జ్ఞాపకమని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రాలు, గొప్ప లెగసీ ఎప్పటికీ నిలిచిపోతాయని భావోద్వేగంతో ట్వీట్ చేశారు.