రైల్వే కోడూరులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వే కోడూరు

రైల్వే కోడూరులో ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి. హరినాథ్రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్మిక రంగంలో మార్పులపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఈ తరగతులు దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు.