అరుదైన పురావస్తు అన్వేషణ: దక్షిణ ఫ్రాన్స్ లో డైనోసార్ గుడ్లు వెలుగులోకి

రిపోర్టర్: శివ స్థలం: France

ఫ్రాన్స్ లోని మెజ్ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్ లో సుమారు డెబ్బై కోట్ల సంవత్సరాల నాటి వంద డైనోసార్ గుడ్లు లభించినట్లు పరిశోధకులు అలైన్ కాబోట్ వెల్లడించారు. ఈ అసాధారణ అన్వేషణ ద్వారా శాస్త్రవేత్తలకు పూర్వ చారిత్రక జీవుల పునరుత్పత్తి అలవాట్లపై కీలకమైన సమాచారం లభిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. విస్తృత ప్రాంతంలో బయటపడిన ఈ శిలాజాలు ఆ కాలపు జీవవైవిధ్యంపై కొత్త వెలుగులు నింపుతున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.