గాజాలో పరిస్థితులు సిగ్గుచేటంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: World

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ గాజాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు అత్యంత సిగ్గుచేటుగా ఉన్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం పట్ల అంతర్జాతీయ సమాజం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. హోర్ముజ్ జలసంధిని బ్లాక్‌మెయిల్ కోసం ఉపయోగించరాదని నొక్కిచెప్పిన ఆయన, నౌకల రాకపోకల కోసం ఈ జలమార్గాన్ని వెంటనే తిరిగి తెరవడం అత్యంత ప్రాధాన్యతని స్పష్టం చేశారు.