గోపికా వేషధారణలలో ఆకట్టుకున్న బెల్లంపల్లి చిన్నారులు
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా చిన్నారులు గోపికా వేషధారణలలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
ఉదయమే ప్రజలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధమైన పద్ధతిలో చిన్నారులను అలంకరించిన తీరు అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.