'లుగురు దుర్మరణం': రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
రిపోర్టర్: అశోక్
స్థలం: రాజస్థాన్
రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా పరిధిలో ఉన్న జైపూర్-ఫలోడి మెగా హైవేపై గురువారం తెల్లవారుజామున సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారును డంపర్ లారీ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిథ్ది బైపాస్ వద్ద జరిగిన ఈ భీకర ప్రమాదంలో శీతల్ రాజ్‌పుత్, తులసి, లక్ష్మణ్ సింగ్, డ్రైవర్ రామ్‌కిషన్ మేఘ్వాల్ ప్రాణాలు కోల్పోయారు. నంబర్ ప్లేట్ లేని అక్రమ డంపర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.